
ఇకపై రోబోటిక్ తుంటిమార్పిడి సర్జరీలు
స్ట్రైకర్ సంస్థతో సాయిభాస్కర్ ఆస్పత్రి ఒప్పందం
గుంటూరు మెడికల్: ఇప్పటివరకు మోకీలు మార్పిడి సర్జరీలకు మాత్రమే రోబోటిక్ వ్యవస్థను వినియోగిస్తుండగా, ఇకపై తుంటి మార్పిడిలకు కూడా రోబోటిక్ సర్జరీలు చేయనున్నట్లు సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి చెప్పారు. అందుకోసం వరల్డ్ క్లాస్ రోబోటిక్ సంస్థ స్ట్రైకర్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలోని తమ ఆస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ తర్వాత తుంటి కీలు అరుగుదలపై తీవ్ర ప్రభావం చూపి, చిన్న వయస్సులోనే తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తుందన్నారు. రోబోటిక్ వ్యవస్థతో రోగికి మరింత మెరుగైన వైద్యసేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఏపీలోనే మొదటిసారిగా తుంటి మార్పిడి ఆపరేషన్లలో మాకొ హిప్ అండ్ నీ రోబోటిక్‌ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అక్టోబర్ నుంచి తమ ఆస్పత్రిలో రోబోటిక్ తుండి మార్పిడి ఆపరేషన్లు అందుబాటులోకి వస్తాయన్నారు.