
ప్రమాదంలో గ్రానైట్ కార్మికుడు మృతి
బల్లికురవ: రాయి ఎత్తుతున్న సమయంలో గొలుసు తెగి రాయి, యంత్రం మీద పడటంతో కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉప్పమాగులూరు సమీపంలోని హర్షిత గ్రానైట్ పరిశ్రమలో జరిగింది. ఎస్సై వై. నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాకేష్ కుమార్(29) పరిశ్రమలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. కటింగ్ రాయిని మిషన్‌పైకి ఎత్తుతుండగా రాయికి కట్టిన గొలుగు తెగింది. రాయితోపాటు తుప్పు పట్టిన యంత్రం కూడా అతడిపై పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చిలకలూరిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ప్రమాదంలో గ్రానైట్ కార్మికుడు మృతి