
శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణమాసం, తిథి: బ.చతుర్దశి ఉ.11.40 వరకు, తదుపరి అమావాస్య నక్షత్రం: ఆశ్లేష రా.7.02 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ఉ.6.45 నుండి 8.32 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.08 వరకు తదుపరి ప.12.26 నుండి 1.18 వరకు అమృతఘడియలు: సా.5.16 నుండి 7.02 వరకు
సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.18
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం: అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహం.
మిథునం: మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
కర్కాటకం: సన్నిహితుల నుండి ధనలాభం. పనులు చకచకా సాగుతాయి. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగాన్వేషణలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. నిరంతర శ్రమ. ప్రయాణాల్లో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆసక్తికర సమాచారం తెలుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
తుల: నూతన ఉద్యోగప్రాప్తి. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.
వృశ్చికం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
ధనుస్సు: రుణదాతల ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. పరిస్థితులు అనుకూలించవు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం: కుటుంబంలో మీరంటే మరింత గౌరవం లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.
కుంభం: పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
మీనం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.