
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: శు.తదియ రా.11.18 వరకు తదుపరి చవితి, నక్షత్రం: మఖ సా.5.59 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ఉ.5.43 నుండి 7.21 వరకు, తదుపరి రా.2.20 నుండి 4.00 వరకు, దుర్ముహూర్తం: సా.4.50 నుండి 5.42 వరకు, అమృత ఘడియలు: ప.3.34 నుండి 5.13 వరకు.
సూర్యోదయం : 5.40
సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం.... కుటుంబంలో వివాదాలు, సమస్యలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యభంగం.
వృషభం... దూరప్రయాణాలు. రుణఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాలలో మార్చుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
మిథునం..... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం.... మిత్రులతో అకారణంగా వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహం.... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కన్య.... శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల.... పనులు విజయవంంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
వృశ్చికం.... ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు రాగలవు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
ధనుస్సు.... ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
మకరం.... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం.... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు.
మీనం... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విందువినోదాలు.