Weekly Horoscope: వారంలో ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు చాలావరకూ తీరతాయి

Today Horoscope 22-05-2022 To 28-05-2022 - Sakshi

మేషం...
ఆర్థిక ఇబ్బందులు చాలావరకూ తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీ మనోగతాన్ని బం«ధువులు గుర్తించి సహాయపడతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనయోగం. విద్యార్థుల ఆశయం ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృషభం...
ఒక విషయంలో కుటుంబసభ్యులతో విభేదిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు క్రమేపీ తొలుగుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు కొంతనెమ్మదిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మిథునం...
రుణభారాలు కొంత తగ్గుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు అందుతాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో  అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యావకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన, ఆస్తిలాభాలు కలుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం....
వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తుల వివాదాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళారంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కన్య..
ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలను చేపట్టే వీలుంది. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. వ్యాపారాలలో మరింత అనుకూలత. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. బంధువిరోధాలు. గులాబీ, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల....
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించకుంటారు. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో  ధనవ్యయం. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం...
మొదట్లో కుటుంబసమస్యలు ఎదురై కాస్త చికాకు పరుస్తాయి. అలాగే, ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. క్రమేపీ వీటి నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో అనారోగ్యం, వైద్యసేవలు. వృథా ధనవ్యయం. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠనం మంచిది.

ధనుస్సు...
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు మరింత పెరుగుతాయి. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. బంధువులను కలుసుకుని మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో ఆటంకాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. తీర్థయాత్రలు. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం...
ముఖ్య వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారికి సేవలకు తగిన ప్రోత్సాహం అందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం...
వీరికి అన్నింటా విజయమే. అందరిలోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది. పరపతి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, గృహంకొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు ఫలప్రదమవుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మీనం..
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిరకాల కోరిక నెరవేరి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top