Horoscope Today: 1 January 2023 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి భూలాభాలు, వాహనాలు కొంటారు.. ధనప్రాప్తి

Jan 1 2023 6:44 AM | Updated on Jan 1 2023 11:06 AM

Today Horoscope 01-01-2023 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, తిథి: శు.దశమి రా.10.30 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం: అశ్వని సా.4.36 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ప.12.34 నుండి 2.11 వరకు, తదుపరి రా.2.22 నుండి 4.01 వరకు, దుర్ముహూర్తం: సా.4.03 నుండి 4.49 వరకు, అమృతఘడియలు: ఉ.9.23 నుండి 11.01 వరకు.

సూర్యోదయం        :  6.34
సూర్యాస్తమయం    :  5.32
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వస్తులాభాలు. పరిస్థితులు మరింత సానుకూలం. ధనప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విశేష ప్రతిభ.

వృషభం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రుల కలయిక. కుటుంబంలో ప్రోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: కార్యక్రమాలలో నూతనోత్సాహం. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి స్నేహితుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కర్కాటకం: నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

సింహం: పనులలో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: రుణయత్నాలు. పనుల్లో జాప్యం. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. భూలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. భూలాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం: ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. గతం గుర్తుకు వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

కుంభం: పనులు నెమ్మదిగా సాగినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మీనం: వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement