ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు సజావుగా సాగుతాయి | Today Telugu Horoscope On April 17th, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు సజావుగా సాగుతాయి

Apr 17 2025 4:59 AM | Updated on Apr 17 2025 9:54 AM

Rasi Phalalu: Daily Horoscope On 17-04-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.చవితి ప.12.01 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: జ్యేష్ఠ తె.5.12 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి మూల, వర్జ్యం: ఉ.9.14 నుండి 10.58 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.55 నుండి 10.45 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు,అమృత ఘడియలు: రా.7.30 నుండి 9.15 వరకు.

సూర్యోదయం :  5.48
సూర్యాస్తమయం  :  6.11
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం... శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృషభం... కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం.  వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

మిథునం.... మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. బంధువుల నుంచి  ఆహ్వానాలు రాగలవు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కర్కాటకం.... నిరుద్యోగులకు కీలక సమాచారం. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాల పరిష్కారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు.

సింహం.... పనుల్లో  కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలలో ఇబ్బందులు.  ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు.

కన్య.... బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. విచిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.

తుల.... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. ప్రముఖులతో పరిచయాలు..

వృశ్చికం.... పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. అనారోగ్యం. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఆలయ దర్శనాలు.

ధనుస్సు... కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వస్తులాభాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. విందువినోదాలు.

మకరం... చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువర్గంతో వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు కొంత గందరగోళం.

కుంభం... పనులు చకచకా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం... భూవివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. కళాకారులకు పురస్కారాలు అందుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement