గ్రహం అనుగ్రహం (20-10-2020) | Daily Horoscope In Telugu (20-10-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (20-10-2020)

Oct 20 2020 6:37 AM | Updated on Oct 20 2020 6:37 AM

Daily Horoscope In Telugu (20-10-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి శు.చవితి సా.4.43 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం అనూరాధ ఉ.9.35 వరకు, తదుపరి జ్యేష్ఠ వర్జ్యం ప.2.54 నుంచి 4.25 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి 9.03 వరకు, తదుపరి రా.10.30 నుంచి 11.21 వరకు అమృతఘడియలు... రా.11.57 నుంచి 1.24 వరకు.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.33
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు


రాశిఫలం
మేషం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: పనుల్లో అనుకూలత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పాతమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మిథునం: బంధువులతో వివాదాలు తీరతాయి. విద్యార్థులకు ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కీలక నిర్ణయాలలో మార్పులు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు.  ఆలోచనలు నిలకడగా సాగవు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో  చిక్కులు.

సింహం: బంధువులతో విభేదాలు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు.  ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. ధనలాభం. నూతన విద్యావకాశాలు. దైవదర్శనాలు. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటాయి.

తుల: మిత్రులతో తగాదాలు. శ్రమాధిక్యం. ముఖ్యమైన  పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

వృశ్చికం: ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.

ధనుస్సు: బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. పనులు కొన్ని వాయిదా పడతాయి. నిర్ణయాలు వాయిదా. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మకరం: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

కుంభం: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సమాజంలో విశేష గౌరవం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులలో విజయం. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మీనం: మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement