గంగ ఒడికి గణపతి | - | Sakshi
Sakshi News home page

గంగ ఒడికి గణపతి

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

మదనపల్లె సిటీ: ఆదిపూజల దేవుడు...ఆది దంపతుల సుతుడు...బొజ్జ గణపయ్య నిమజ్జనాన్ని బుధవారం మూడవరోజు భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పందిళ్లలో ఏర్పాటు చేసిన గణపయ్యల విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. భక్తులు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహ భరితంగా నిర్వహించారు. తొలుత కమిటీ నిర్వా హకులు భక్తులకు అన్నదానాలు చేశారు. ఆపై స్వామిని నిమజ్జనానికి తరలించారు.

సందడే సందడి: జైబోలో గణేష్‌ మహరాజ్‌కీ....గణపతి బొప్పమోరియా.. నినాదాలతో నిమజ్జన దారులు హోరెత్తాయి. తప్పెట్లు, చెక్కభజనలు, బ్యాండుమేళాలు, భక్తి గీతాలాపనలు, యువకుల ఈలలు, కేరింతల మధ్య కట్టల తెగిన ఉత్సాహం మధ్య గణపతి నిమజ్జనం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జిల్లాలో గణపయ్య విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల గణపతి చేతిలో పూజలందుకున్న లడ్డూల వేలం పాటలుతో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించారు.

కలికిరిలో పార్వతీ తనయుడి గ్రామోత్సం

పుంగనూరులో గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో యువత కోలాహలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement