తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం | - | Sakshi
Sakshi News home page

తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం

Sep 17 2026 12:14 AM | Updated on Sep 17 2026 12:14 AM

సాక్షి, మదనపల్లె: ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బి.వెంకటమోహన్‌ అన్నారు. బుధవారం మదనపల్లె మండలం చిన్నతిప్పసముద్రం గ్రామ పంచాయతీలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో పంటల వైవిధ్యాన్ని పెంచుకుంటూ స్థిరమైన దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. వర్షాధార రైతు సిద్ధయ్యకు చెందిన పీఎండీఎస్‌ సాగు విధాన క్షేత్రాన్ని, ప్రసాద్‌కు చెందిన ఏ–గ్రేడ్‌ మోడల్‌ క్షేత్రాన్ని సందర్శించి బెండ, మాటిక, బీర, కంది తదితర పంటల సాగును పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ మజీద్‌, జేడీఏ హరిప్రియ, ఇన్‌చార్జి ఏడీఏ నవీన్‌ పాల్గొన్నారు.

ప్రయాణికులకుమెరుగైన వసతులు

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : విమానయాన ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కడప ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ సుజిత్‌కుమార్‌ పొద్దార్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు భారతదేశంలోని అన్ని విమానాశ్రయాల్లో యాత్రి సేవా అభియాన్‌–2026ను నిర్వహించాలని ప్రణాళిక రూపొందించిందన్నారు. అందులో భాగంగానే యాత్రి సేవా అభియాన్‌ సందర్భంగా కడప విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement