తేరు కదిలె.. భక్తులు మురిసె | - | Sakshi
Sakshi News home page

తేరు కదిలె.. భక్తులు మురిసె

Jul 30 2026 1:33 AM | Updated on Jul 30 2026 1:33 AM

తేరు కదిలె.. భక్తులు మురిసె

నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు సాయికృష్ణ, సునీల్‌కుమార్‌, పాంచరాత్ర ఆగమ పండితులు మనోజ్‌, పవన్‌, పార్థసారథి, రంగనాథాచార్యులు, వేదపారాయణం, సంతోష కృష్ణశర్మ, లావణ్య రామశర్మలు పూజలు నిర్వహించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రథాన్ని లాగి ముందుకు నడిపించారు. భక్తుల గోవింద నామస్మరణలతో మాఢవీధులు మార్మోగాయి. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. రాత్రి అశ్వవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ దిలీప్‌కుమార్‌, తదితరులు పా ల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఇన్‌స్పెక్టర్‌ దిలీప్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement