కడప సెవెన్‌రోడ్స్ : అమెరికా తెలుగు సంఘం (ఆటా) మహాసభలకు జిల్లాకు చెందిన ప్రముఖ వైమానిక అత్యవసర వైద్య చికిత్స నిపుణులు, ‘రియాక్ట్’ సంస్థ అధినేత డాక్టర్ నీల్ రోహిత్‌రెడ్డికి ఆత్మీయ ఆహ్వానం అందింది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు అమెరికాలో జరగనున్న ఈ సభల్లో పాల్గొనేందుకు ఆయన మంగళవారం బయలుదేరి వెళ్లారు.
చెన్నూరుకు చెందిన వైవీయూ తెలుగు ఆచార్యులు తప్పెట రాంప్రసాద్‌రెడ్డి, ఆచార్య రమాదేవి కుమారుడైన నీల్ రోహిత్‌రెడ్డి వైద్య రంగంలో విశేష గుర్తింపు పొందారు.


