వాల్మీకిపురం : స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జువాలజీ అధ్యాపకుడు గురుమూర్తి ప్రతిష్టాత్మక ‘ఇండియన్ అచీవ్‌మెంట్ అవార్డు–2026’ అందుకున్నారు. కై ్లమేట్ యాక్షన్ ఛేంజ్, మదనపల్లె నగరవనం పరిధిలో మొక్కలు నాటడం, విత్తన బంతులు వెదజల్లడం, రక్తదాన శిబిరాల వంటి విస్తృత సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారు. గురుమూర్తి సేవలను గుర్తించిన ‘హోమ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ ఏటా ఇచ్చే ఈ అవార్డును (అకడమిక్ ఎక్స్‌లెంట్ కేటగిరీ) ఆయనకు అందజేసింది. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు ఆయనను ఘనంగా అభినందించారు.
2న అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 2న ఉదయం 9 గంటలకు అండర్ 18, 20 విభాగాల్లో సీ్త్ర, పురుషులకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 16 ఏళ్లు నిండిన వారు ఆధార్, బర్త్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వివరాలకు 99496 86586, 80198 80995 నంబర్లను సంప్రదించవచ్చు.
మదనపల్లె టౌన్ : చెక్, క్లీన్, కవర్ పాటిద్దాం, డెంగీ వ్యాప్తిని నియంత్రిద్దామని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి, డీహెచ్‌ఈఓ మహమ్మద్ రఫీ తెలిపారు. డెంగీ వ్యతిరేక మాసోత్చావాల సందర్భంగా మదనపల్లి సొసైటీ కాలనీ, నెహ్రు మున్సిపల్ హైస్కూల్, హోప్ మున్సిపల్ హైస్కూల్‌లలో హెచ్‌ఎంలు శీనప్ప, రఘు ఆధ్వర్యంలో విద్యార్థులకు డెంగీపై అవగాహన కల్పించారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగీ, మెదడువాపు, ఫైలేరియా, చికున్‌గున్యా వ్యాధుల నివారణకు మూడు పద్ధతులు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. పరిశీలించండి, శుభ్రపరచండి, మూతలు పెట్టండి ఈ పద్ధతులను పాటిస్తే డెంగీని ఒడించవచ్చని తెలిపారు. ప్రస్తుతం డెంగీ జ్వరాలు ఒక ప్రజా ఆరోగ్య సమస్యగా ఉందని ప్రజల్లో చైతన్యం, అవగాహన తోనే దోమల నియంత్రణ సాధ్యం అని అన్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ, ఇంటి పరిసరాలు పరిశీలించి నీటి నిల్వలు లేకుండా శుభ్ర పరచుకోవాలని నీటి నిల్వల పైన మూతలు ఉంచాలన్నారు. అనంతరం డెంగీ వ్యతిరేక మాసోత్చవాలపై ప్రతిజ్ఞ చేయించారు.


