పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం: కలెక్టర్‌

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

మదనపల్లె : జిల్లా పారిశ్రామికాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో దక్షిణ కొరియాకు చెందిన ‘బూయంగ్‌’ కంపెనీ ప్రతినిధులు, జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌శర్మతో ఆయన సమావేశమయ్యారు. వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి ఇండస్ట్రియల్‌ పార్కులో ఏర్పాటు చేయనున్న ఫుట్‌వేర్‌ పరిశ్రమపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బూయంగ్‌ కంపెనీ, ఎస్‌కేఐ కార్ప్‌ గ్రూప్‌తో కలిసి మూడు దశల్లో ఎగుమతుల ఆధారిత ఫుట్‌వేర్‌ కాంపోనెంట్స్‌ (షూ లేసులు, వెబ్బింగ్స్‌) తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్లకు సరఫరా చేస్తారని వెల్లడించారు. జిల్లాలోని భౌగోళిక అనుకూలత, విద్యుత్‌, నీటి లభ్యత, రవాణా సౌకర్యాలను ప్రతినిధులకు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement