గాలివీడు : గాలివీడులోని ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా బస్టాండ్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అమెను స్థానికులు గాలివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.
చెట్లను నరికేస్తున్నారని ఆవేదన
పుంగనూరు : మండల పరిధి రాగానిపల్లె సమీపంలోని మల్లుపల్లె క్రాస్‌లో సోమవారం రాత్రి చెట్లు నరికి తీసుకెళ్లారని గ్రామస్థులు తెలిపారు. కొందరు చెట్లను నరికి తీసుకెళ్తున్నారని, ఈ విషయమై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న చెట్లను కాపాడి, పర్యావరణ కాలుష్యానికి ముప్పు వాటిల్లకుండా చూడాలని కోరారు.


