దివ్యాంగుల భూమి ఆక్రమణ | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల భూమి ఆక్రమణ

Jul 28 2026 1:54 AM | Updated on Jul 28 2026 1:54 AM

దివ్యాంగుల భూమి ఆక్రమణ

పుంగనూరు మండలం చెదళ్లకు చెందిన విష్ణువర్ధన్‌, మునిలక్ష్మి దివ్వాంగులు. ప్రేమ వివాహం చేసుకున్న వారికి వారసత్వంగా రావాల్సిన నాలుగు ఎకరాల భూమిని కూడా అతడి సోదరుడు ఆక్రమించేశాడని, తమపై దౌర్జన్యానికి రావడంతో పాటు భూమిలోకి వస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వారి నుంచి రక్షణ కల్పించడంతో పాటు తన వాటా భూమి వచ్చేలా చర్యలు తీసుకోవాలని పీజీఆర్‌ఎస్‌లో కోరారు. వీరికి రక్షణ కల్పించడంతో పాటు భూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement