మదనపల్లె టౌన్: వలసపల్లి గ్రానైట్ ఫ్యాక్టరీ లీజు వివాదంలో తమపై దాడి చేసి చంపుతామని బెదిరించిన జనసేన నేత అతికారి దినేష్‌పై పోలీసులు చర్యలు తీసు కోవాలని బాధితురాలు లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. ఆదివారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నేత బీరంగి రేవతితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. మండలంలోని వలసపల్లి గ్రానైట్ ఫ్యాక్టరీకి తమకు ఇంకా 2 సంవత్సరాల పాటు లీజు గడువు ఉందని తెలిపారు. అయినా సరే బలవంతంగా ఫ్యాక్టరీని ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించడానికి వెళ్లగా జనసేన నేత అతికారి దినేష్ 20 మంది అనుచరులతో వచ్చి తమపై దాడి చేశారని, చంపుతామని బెదిరించారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. బి.కొత్తకోటకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు బీరంగి రేవతి కూడా బాధితురాలికి మద్దతుగా మాట్లాడి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చంపుతామని బెదిరిస్తున్నారని
బాధితురాలు ఆవేదన
పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి


