ఈత కొమ్మకు తోడు గిజిగాడి గూళ్లలా కొమ్మ కొమ్మకో ఊయల చిరుగాలుల జోలలా చిటారుకొమ్మల ఆలన తల్లిపిట్టల లాలనలా | - | Sakshi
Sakshi News home page

ఈత కొమ్మకు తోడు గిజిగాడి గూళ్లలా కొమ్మ కొమ్మకో ఊయల చిరుగాలుల జోలలా చిటారుకొమ్మల ఆలన తల్లిపిట్టల లాలనలా

Jul 26 2026 2:08 AM | Updated on Jul 26 2026 2:08 AM

● కొమ్మకొమ్మకో గూడు !

ప్రకృతి గీసిన అత్యద్భుతమైన సజీవ చిత్రమిది. ఏ సివిల్‌ ఇంజనీరుకూ సాధ్యం కాని రీతిలో, కేవలం తన ముక్కుతో ఒక్కో గడ్డిపోచను తెచ్చి, అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో ఈత చెట్టు చిటారుకొమ్మలకు గిజిగాడు అల్లిన ఈ గూళ్లు చూసేకొద్దీ కనువిందు చేస్తున్నాయి. గాలివానలొచ్చినా, తుఫానులు చుట్టుముట్టినా చెక్కుచెదరని రీతిలో ఈ గూళ్లను నిర్మించుకోవడం ప్రకృతిలోని ఒక వింత రహస్యం. ఆ పచ్చని ఈత ఆకుల మధ్య, దోరగా పండుతున్న ఈతగెలల నడుమ వేలాడుతున్న ఈ చిట్టిగూళ్ల లోగిలి నుంచి వినవచ్చే లేత పిట్టల కిలకిలారావాలు తోటంతా కొత్త ప్రాణాన్ని నింపుతున్నాయి. ఎండనక, వాననక రెక్కలొచ్చిన పిల్లల ఆకలి తీర్చేందుకు తల్లిపిట్టలు పడే ఆరాటం, వాటి నిరంతర రాకపోకలతో ఆ గూళ్లు ఓ సజీవ కావ్యమై మెరుస్తున్నాయి. యాంత్రికమైన నగర జీవితపు ఒత్తిళ్లలో కాస్త సేదతీరి చూస్తే.. ఈ పచ్చని ప్రకృతి, ఆ పక్షుల గూటి సవ్వడి మనసును తేలికపరిచే ఒక అద్భుతమైన అనుభూతి! – మురళీకృష్ణ, గుర్రంకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement