మదనపల్లె టౌన్ : ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. తాలూకా సీఐ కల వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె చంద్ర కాలనీకి చెందిన రాధాకష్ణ (29) సొంత పనిపై సుబ్బారెడ్డి లేఅవుట్‌లోని అత్తగారి ఇంటికి వెళ్లాడు. పని ముగించుకుని బైక్‌పై బైపాస్ రోడ్డు మీదుగా చంద్ర కాలనీకి వస్తుండగా వెన్నెల రెస్టారెంట్ సమీపంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన రాధాకష్ణను స్థానికులు గుర్తించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను గుర్తించే పనిలో ఉన్నామని సీఐ తెలిపారు.


