● నిర్ధారించిన పోలీసుల
● మహారాష్ట్రకు చెందిన లారీగా గుర్తింపు
పుంగనూరు : పుంగనూరు సమీపంలోని ఎంబీటి రోడ్డు జాతీయ రహదారిపై ఈ నెల 14న అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఎకై ్సజ్ కానిస్టేబుల్ దేవేంద్ర (32) అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పలు అనుమానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమయంలో రహదారిపై ఉన్న బారికేడ్లను దేవేంద్ర ద్విచక్రవాహనంపై వెళుతూ ఢీకొట్టారు. అదే సమయంలో మహారాష్ట్రకు చెందిన లారీ వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టి వెళ్లినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన లారీని సీజ్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. దేవేంద్ర మృతికి ఇతర కారణాలు ఏవీ లేవని పోలీసులు నిర్ధారించారు. త్వరలోనే డ్రైవర్‌ను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించనున్నారు. పది రోజులుగా తీవ్ర సంచలనం కలిగించిన దేవేంద్ర మృతి రోడ్డు ప్రమాదమేనని నిర్ధారణ చేసి వెల్లడించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.


