మదనపల్లె టౌన్ : మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో గత ఆరు నెలల్లో పాముకాటుకు గురై చికిత్స పొందిన వారి సంఖ్య 185కు చేరినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వీరిలో 11 మంది మృతి చెందగా, మరికొందరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
మూడు రోజుల కిందట బి.కొత్తకోట మండలానికి చెందిన మహిళా రైతు శివమ్మ పాముకాటుకు గురై చికిత్స పొందుతూ మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ ఘటన పాముకాట్ల తీవ్రతకు అద్దం పడుతోంది.
నెలల వారీగా కేసుల వివరాలు
మదనపల్లె జిల్లా ఆస్పత్రి రికార్డుల ప్రకారం ఈ ఏడాది జనవరిలో 20 మంది, ఫిబ్రవరిలో 22, మార్చిలో 22, ఏప్రిల్‌లో 32, మేలో 43, అత్యధికంగా జూన్‌న్‌లో 46 మంది పాముకాట్లతో ఆస్పత్రిలో చేరారు. వేసవి, వర్షాకాలం ప్రారంభంలో పాముకాట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పాము కాట్లపై వైద్యుల సూచన
వర్షాకాలం సమీపిస్తుండటంతో పాములు పొలాలు, ఇళ్లలోకి వస్తుంటాయని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాముకాటుకు గురైన వెంటనే ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాపాయం తప్పించవచ్చని, అశాసీ్త్రయ పద్ధతిలో చికిత్స చేయొద్దని హెచ్చరిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో యాంటీ స్నేక్ వెనమ్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో పెరిగిన పాముకాట్ల కేసులు
ఆరు నెలల్లో 185 మందికి చికిత్స
వైద్యం అందక 11 మంది మృతి
అత్యధికంగా జూనన్‌లోనే 46 కేసులు నమోదు


