అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అండర్‌–19 క్రికెట్‌ పోటీలు ప్రారంభం

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 మెన్‌ మల్టీ డే అంతర్‌ జిల్లా ఐదో విడత మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. గురువారం వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో కడప–చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 80 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఆ జట్టులోని హర్షవర్దన్‌ 195 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 135 పరుగులు చేయగా మరో బ్యాట్స్‌మెన్‌ వరుణ్‌ 71 పరుగులు చేశాడు. కడప జట్టులోని గైబు 2 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇరోజు ఆట ముగిసింది.

కెఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

అదే విధంగా కెఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు–అనంతపురం జట్టు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 60 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్‌ అయింది. జట్టులోని మిథున్‌కళ్యాణ్‌ 68, సుశాంత్‌ 50 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్‌ రెడ్డి 4, కిరణ్‌కుమార్‌ 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 20.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఆదినారాయణ 30 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని తేజసాయి 2 వికెట్లు తీశాడు. దీంతో అనంతపురం జట్టు 139 పరుగు వెనుకంజలో ఉంది. దీంతో తొలి ఇరోజు ఆట ముగిసింది.

ఇద్దరు యువకులపై పోక్సో కేసు

కడప అర్బన్‌ : కడప టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బాలిక పట్ల, వెంకట్‌, చిన్న అనే ఇద్దరు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వీరిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి పోక్సో యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement