పీలేరురూరల్ : జిల్లాలో 32 గ్రామాల్లో ఐదో విడత భూ రీసర్వే చేస్తున్నట్లు జిల్లా సర్వేయర్, భూముల రికార్డు అధికారి శాంతరాజ్.పి.యస్. అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐదో విడత 22 మండలాల్లో 32 గ్రామాల్లో సర్వే జరుగుతున్నట్లు తెలిపారు. 1.50 లక్షల ఎకరాల్లో రీసర్వే చేపడుతున్నట్లు చెప్పారు. పీలేరు రెవెన్యూ డివిజన్‌లో 8 మండలాల్లోని 11 గ్రామాల్లో రీసర్వే జరుగుతోందని తెలిపారు. పీలేరు మండలం దొడ్డిపల్లె గ్రామంలో రీసర్వే జరుగుతున్నట్లు చెప్పారు. భూసర్వేలో తప్పు ఒప్పులు లేకుండా ప్రతి గ్రామంలోనూ రైతులకు ముందే సమాచారం ఇచ్చి, రైతుల సంక్షేమంలో భూరీసర్వే చేపట్టాలన్నారు. ఆగష్టు నెల ఆఖరులోపు రీసర్వే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎం. శివకుమార్, డీఐఓస్ టి. బాలకుళ్ళాయస్వామి, డీటీ ప్రసాద్, ఆర్‌ఐ మురగయ్య, సర్వేయర్ రెడ్డిశేఖర్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.


