కలికిరి : మర్రికుంటపల్లిలోని అక్కదేవతల ఆలయంలోనికి స్థానిక గ్రామస్తులను రానివ్వకుండా సీ ఆర్‌పీఎఫ్ అధికారులు గేటు వేస్తుండటంతో గ్రామస్తుల ఫి ర్యాదు మేరకు బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆలయస్థలాన్ని పరిశీలించారు. జేసీ గ్రామస్తులతో పాటు సీఆర్‌పీఎఫ్ అధికారులతో మా ట్లాడారు. ఆలయానికి గ్రామస్తుల రాకపోకలకు అనువుగా ఉండేటట్లు, అలాగే సీఆర్‌పీఎఫ్ కేంద్రానికి మరో చోట భూమి కేటాయింపునకు చర్య లు తీసుకుంటామన్నారు. అనంతరం పత్తేగడ, కొ ర్లకుంట రెవెన్యూ గ్రామాల పరిధిలో రెండు పెట్రో బంకుల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులకు సంబందించి భూములను జేసీ పరిశీలించారు. ఆ యన వెంట పీలేరు ఆర్డీఒ నారాయణ రెడ్డి, తహశీల్దారు సయ్యద్ అహ్మద్, మండల సర్వేయరు రెడ్డె ప్ప, విఆర్‌ఒలు సురేష్‌కుమార్‌రెడ్డి, నరేంద్రరెడ్డి, విలేజ్ సర్వేయర్లు పాల్గొన్నారు.


