● సుండుపల్లెలో బైక్‌ను ఢీ కొన్న టిప్పర్
● ఇద్దరు దుర్మరణం..వీధినపడ్డ కుటుంబాలు
రాజంపేట/సుండుపల్లె : చెయ్యేరు, మాండవ్యనది, పెన్నానది పరిధిలో ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి తీసుకెళ్లే టిప్పర్లు అతివేగంగా సమీప గ్రామాల మీదుగా వెళుతుంటే స్ధానికుల గుండెల్లో భయాందోళన. ఈ సమస్య గురించి పట్టించుకునే అధికారే కరువయ్యారన్న విమర్శలు ఉన్నాయి. వినతులు, పిర్యాదులు చెత్తబుట్టలో పడిపోయాయి. ఇసుకరీచ్. గ్రామాల మీదుగా ఉండే రోడ్డు మీద వెళ్లాలంటే పాదచారులు, వాహనాదరులు భయపడుతున్నారు. ఏ వైపు నుంచి ఇసుకటిప్పర్లు మీద పడతాయోనని ఆందోళన చెందుతున్నారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
ఆగస్టు 15వతేదీ వరకు ఇసుకరీచ్‌ల నుంచి ఇసుకను తరలించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటి టీడీపీ ఇసుకాసురులు మాత్రం ఖాతరు చేయలేదని ఇసుకరీచ్ బాధితులు విమర్శిస్తున్నారు. ఇసుక తరలింపు మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి ఇసుకటిప్పలు అడ్డూ అదుపులేకుండా దూసుకుపోతున్నాయి.
సుండుపల్లెలో జరిగే సంతకు వెళుతూ..
తాజాగా సుండుపల్లె–సానిపాయి మార్గంలోని ఉప్పరపల్లె వద్ద వెనుక నుంచి గొర్రెల పెంపకదారులు జయరామ,(45), రవీంద్ర (47) సుండుపల్లెలో జరిగే సంతకు బయలుదేరారు. తమ వెనుక (ఇసుక టిప్పర్)మృత్యువు వెంటాడుతుందనే విషయం గమనించలేదు. బైక్‌పై వెళుతున్న జయరామ,రవీంద్రను టిప్పరు ఢీ కొంది. అక్కడక్కడికే మృతిచెందారు.స్థానికులు, కుటుంబీకులు ఈ సంఘటనపై ఆందోళనకు దిగారు.మృతదేహలను తరలించేందుకు వీలులేదని రహదారిపై బైఠాయించారు. సీఐ సురేష్ సంఘటనస్ధలానికి చేరుకొని మృతదేహలను తరలించాలని వాహనంతో పాటు వచ్చేశారు. సీఐ రాక తమను విస్మయానికి గురిచేసిందని వాపోతున్నారు. తర్వాత పోస్టుమార్టరం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అండగా నిలిచారు.మృతుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్. జిల్లా ఎస్పీలను ఫోన్ ద్వారా కోరారు.
జీవాలే జీవనాధరం
మృతిచెందిన జయరామ, రవీంద్రలకు జీవాల వ్యాపారమే జీవనాధారం. జీవాలు(పొట్టేళ్లు) కొనుగోలు చేయడం, వాటిని పెంచడం, అమ్మడం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. సుండుపల్లె వారపు సంతకు ఇరువురు బైకులో బయలుదేరి, మృత్యుఒడికి చేరుకున్నారు. రవీంద్రకు భార్య సంపూర్ణ, ఇంటర్‌పూర్తి చేసుకున్న కుమార్తె, టెన్త్ చదువుకునే కుమారుడు ఉన్నారు. భార్య జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లింది. మరో మృతుడు అబ్బన్నగారి జయరామకు భార్యప్రభావతి, కుమారుడు ఒకరు ఉన్నారు. భార్య కువైట్‌లో ఉండగా కుమారుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇరుకుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబాలో విషాదచాయలు అలుముకున్నాయి.
వందలాది టిప్పర్లతో ఇసుక తరలింపు
తమ గ్రామమీదుగా వందలాది టిప్పర్లతో ఇసుక తరలింపు జరుగుతోంది. వర్షాలు కురవక, తాగునీరు లేక గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే ప్రతిరోజు వందలాది టిప్పర్లతో ఇసుకను తరిలించారు. గ్రామాల్లో రోడ్లపై నడవాలన్నా, వాహనదారులు వెళ్లాలన్నా జనం భయపడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి.
– బాలయ్య, చిన్నగొల్లపల్లె,
సుండుపల్లె మండలం


