మదనపల్లె టౌన్ : నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న మహిళపై మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ కథనం మేరకు.. మండలంలోని యనమల వారి పల్లికి చెందిన అంగజాల రమాదేవి (54) నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సిబ్బందితో కలిసి రమాదేవి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అక్కడ అక్రమంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బెల్ట్ షాపు నిర్వాహకురాలు రమాదేవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కళా వెంకటరమణ తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు.
మండల కార్యాలయం పరిశీలన
రామాపురం : స్థానిక మండల కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ బుధవారం సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజిఆర్‌ఎస్) నిర్వహణను పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని మండల కార్యాలయ సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం గోపగుడిపల్లి గ్రామాన్ని సందర్శించిన స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ సమ్మాద్ ఖాన్, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మహిళ అదృశ్యంపై
కేసు నమోదు
పెద్దమండ్యం : ఓ మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వెలిగల్లు గ్రామం పాపదాతగారిపల్లెకు చెందిన కొంకల రెడ్డెప్పరెడ్డి రెండవ భార్య ఇరగమ్మ (53) కనబడలేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆదివారం ఈమె ఇంటి నుండి గ్రామానికి సమీపంలో ఉన్న ఓ పల్లెకు వెలుతున్నట్లు చెప్పి వెళ్లినట్లు భర్త పోలీసులకు తెలిపారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ప్రామిషరీ నోట్ రాయించుకొనేందుకు ఓ పల్లెకు వెళ్లి అదృశ్యమైనట్లు తెలిసింది. ఆర్థిక లావాదేల నేపథ్యంలో ఆమెను ఎవరైనా ఏమైనా చేశారా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పెద్ద మొత్తంలోనే సమీప గ్రామాలలోని రైతుల వద్ద ఆర్థిక లావాదేవీలు ఈమెకు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆమె నివసిస్తున్న ఇంటికి ఓ తాళం వేసి ఉండగా, తాజాగా మరో తాళం వేయడంతో ఆర్థిక లావాదేవిల గురించి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మహిళ అదృశ్యంపై విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
పెద్దముడియం(జమ్మలమడుగు) : పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పెద్దముడియం మండలం మేడిదిన్నె గ్రామానికి చెందిన కొమ్మ ఓబులేసు ఈనెల 13న మృతి చెందాడు. ఇ తని మృతిపై అనుమానాలు ఉన్నాయని, పోస్టు మార్టం నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ నాయకు డు చిన్నయ్య మాదిగ ఆధ్వర్యంలో ఆర్డీఓకు విన తి పత్రం సమర్పించారు. ఆర్డీఓ నొస్సం పోలీసులకు రెఫర్ చేశారు.దీంతో సంజామల మండలంలోని పోలీసులను దళిత సంఘాల నాయకులు క లిశారు. ఈసందర్భంగా కొమ్మ ఓబులేసుకు మో కాళ్ల నొప్పులతో బాధపడుతూ నొస్సంలోని ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించాడు. సూది వేయించుకుని ఓబులేసు తిరిగి గ్రామానికి వచ్చాడు. రా గానే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడి శరీరంపై బొబ్బలు వచ్చాయి. సూది వేసిన నాలుగు గంటలలోపే ఓబులేసు మృతిచెందాడు. ఇది తెలి యని బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.


