మదనపల్లె సిటీ : ఏపీఎస్ ఆర్టీసీలో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మదనపల్లె ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వ హించారు.. జేఏసీ జిల్లా కన్వీనర్లు పి.వి.భయ్యారెడ్డి, బాబ్జి, వినోద్‌లు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ బాద్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా ఆర్టీసీ క్రమంగా ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరగుతున్నాయని ఆరోపించారు. ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణను ఆర్టీసీకే అప్పగించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర ఐఆర్ ప్రకటించాలని, 11వ పీఆర్సీ వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు ఎన్.వి.కుమార్, బిఎస్‌ఎస్ రెడ్డి, కెఎల్ దేవి, సెల్వి పాల్గొన్నారు.


