అక్రమాలపై పోరుబాట | - | Sakshi
Sakshi News home page

అక్రమాలపై పోరుబాట

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

సాక్షి అన్నమయ్య: అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ నిరుద్యోగులను డీఎస్సీ పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి తర్వాత డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ లాంటిది చూపించకుండా ముందుకు వెళ్లడం..అందులో అనేక అనుమానాలు ఉన్నా వాటిని నివృత్తి చేయకపోవడం.. జిల్లా కమిటీలకు సంబంధం లేకుండా వ్యవహారాన్ని నడిపించడంపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఎక్కడిక్కడ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తోంది. అంతేకాకుండా ప్రత్యేక సంస్థ అయిన సీబీఐ ద్వారా విచారణ జరపాలని కోరుతోంది. డీఎస్సీలో గోల్‌ మాల్‌ జరిగిందని నిరుద్యోగులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా.. విద్యా రంగ వ్యవస్థను వారి గుప్పిట్లో పెట్టుకుని బయటకు తెలియకుండా నడుపుతున్న వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ సీరియస్‌గా తీసుకుని పార్టీ అధిష్టానం ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఆందోళన నిర్వహించనున్నారు.

వైఎస్సార్‌సీపీ డిమాండ్లు ఇవి..

● డీఎస్సీ నియామకాలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో లేదా సీబీఐతో న్యాయ విచారణ జరపాలి.

● ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడ్‌, నిర్వహణలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్టు సిబ్బంది పాత్రపై పూర్తి విచాణ జరపాలి.

● మెరిట్‌ లిస్టులు, మార్కులు, ఎంపిక వివరాలను పూర్తిగా ప్రజలకు వెల్లడించాలి.

● అక్రమంగా ఎంపికై న వారిపై చర్యలు తీసుకుని, నిజమైన అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి.

● డబ్బులు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

● స్పోర్ట్స్‌ కోటా, రిజర్వేషన్‌, కాల్‌ లెటర్లలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక విచారణ జరపాలి.

● కోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేసి నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలి.

● ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి.

డీఎస్సీలో జరిగిన వ్యవహారాలపైకదులుతున్న నిరుద్యోగులు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలకు పిలుపునిచ్చిన పార్టీ అధిష్టానం

నేడు మదనపల్లెలో అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద నిరసన

Advertisement
 
Advertisement
Advertisement