రైలు కింద పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వ్యక్తి మృతి

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

ములకలచెరువు : రైలు కింద పడి ఒక వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఇందిరా కాలనీకి చెందిన అబ్దుల్‌(30) బుధవారం రాత్రి నాగర్‌కోయల్‌ రైలు కింద పడి మృతిచెందాడు. గమనించిన రైల్వే సిబ్బంది కదిరి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ములకలచెరువువాసిగా నిర్ధారించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

అనారోగ్యంతో ఆత్మహత్య

పుంగనూరు : మండలంలోని బండ్లపల్లెలో నివాసం ఉన్న శ్రీనివాసులు(43) శ్రీనివాసులు కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు శ్రీనివాసులను కాపాడేందుకు ప్రయత్నించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement