అంతర్జాతీయ పోటీలకు రామాపురం క్రీడాకారిణి | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ పోటీలకు రామాపురం క్రీడాకారిణి

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

రామాపురం : మండలంలోని గోపగుడిపల్లి గ్రామం గొల్లపల్లికి చెందిన యనపడ్డ గోవిందు కుమార్తె యనపడ్డ సంజన అంతర్జాతీయ జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ కు ఎంపిక కావడం మండలానికి గర్వకారణమైంది. అంతర్జాతీయ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి , కోచ్‌ ప్రసన్న జయశంకర్‌ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరం అనంతరం ఏపీ స్టేట్‌ జూనియర్‌ బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ ఎంపికలో సంజన అద్భుత ప్రతిభ ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. పుదుచ్చేరిలో మే 22 నుంచి 28 వరకు నిర్వహించిన నేషనల్‌ జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో సంజన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చూపింది. చిన్న వయస్సులోనే రాష్ట్ర స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు,గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement