ప్రొద్దుటూరు: మున్సిపాలిటీ పరిధిలోని బొల్లవరం ప్లాట్ల వేలానికి ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రెవెన్యూ రీ సర్వే, జనగణనపై ఇన్‌చార్జి అధికారులైన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, తహసీల్దార్ ఉదయ భాస్కర్ రాజుతో మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా చేపడుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి రికార్డులను పరిశీలించారు. సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసులు, టీపీఓ చంద్రమోహన్, ఏఈలు సురేంద్ర, దస్తగిరి పాల్గొన్నారు.


