సమగ్రశిక్షలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సమగ్రశిక్షలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

Apr 7 2026 8:01 AM | Updated on Apr 7 2026 8:01 AM

మదనపల్లె సిటీ: సమగ్రశిక్షలో ఏఏఎంఓ(ఉర్దూ), ఏపీఓ, ఎఎస్‌ఓ పోస్టులకు జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అనూరాధ తెలిపారు. సహాయ విద్యా సంబంధమైన పర్యవేక్షణ అధికారి (ఎఎఎంఓ) ఉర్దూ, ఒక పోస్టు, అసిస్టెంట్‌ ప్రొగ్రాం ఆఫీసర్‌ (ఏపీఓ) ఒక పోస్టు, అసిస్టెంట్‌ స్టాటికల్‌ ఆఫీసర్‌ (ఎఎస్‌ఓ) పోస్టులు రెండు ఉన్నాయన్నారు. అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు సమగ్రశిక్ష లో పని చేయుటకు బయోడేటాతో పాటు డిగ్రీ,బీఈడీ, పీజీ, ఎంఈడీ, ఇతర సర్టిఫికెట్లుజత చేసి ఈనెల 7 నుంచి 13వతేదీలోపు సంబంధిత ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి ద్వారా జిల్లా ప్రాజెక్టు అధికారి, సమగ్ర శిక్ష, మదనపల్లె, అన్నమయ్య జిల్లా కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సత్వరమే ఫిర్యాదుల పరిష్కారం

మదనపల్లె టౌన్‌: ప్రజా సమస్యల పరష్కార వేదిక పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీల పరిష్కారంలో పోలీసు అధికారులు జాప్యం చేయకూడదని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి జిల్లాలోని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. మదనపల్లె జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 141 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జల్లాలోని పోలీసులు సమస్యలపై పోలీస్‌ స్టేషన్లకు వచ్చేవారి సమస్యలను విని అక్కడే పరష్కరించాలని దేశించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement