కుటుంబ సమస్యలతో ఓ రైతు పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఇందుకు సంబంధించి బాధితుడి కుటుంబీకులు మంగళవారం తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె మండలం, కుక్కరాజు పల్లెకు చెందిన వీరప్ప కొడుకు రైతు వెంకటరమణ(55) కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన రైతు టమాటా చెట్లకు కొట్డానికి తెచ్చి ఇంట్లో పెట్టిన పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడగా, గమనించిన కుటుంబీకులు, బాధిత రైతును వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం రైతు పరిస్థితి విషమంగా మారడంతో డాక్టర్లు వెంటనే తిరుపతి రుయాకు తరలించాలని రెఫర్ చేశారు. ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసుల సమాచారంతో తంబళ్లపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


