మదనపల్లె: ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బీసీ.జనార్దనరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఓ కళ్యాణమండపంలో 2026–27 బడ్జెట్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ అమలు, కేటాయింపులు, లక్ష్యాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిల్లో ప్రతి అధికారి బడ్జెట్ అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు బడ్జెట్ కేటాయింపులు కేవలం పత్రాల పరిమితిలో ఉండకుండా, ప్రజలకు వాస్తవ లాభాలుగా మారేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎమ్మెల్యే షాజహన్‌బాషా, సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ మంత్రి జనార్దనరెడ్డి


