పట్టా భూమిని అక్రమించుకున్నారు | - | Sakshi
Sakshi News home page

పట్టా భూమిని అక్రమించుకున్నారు

Mar 31 2026 8:26 AM | Updated on Mar 31 2026 8:26 AM

రొంపిచెర్ల : పట్టా భూమిని కొందరు డీకేటీ పట్టాతో అక్రమించుకున్నారని బాధితులు సయ్యద్‌ గఫూర్‌సాబ్‌ మనవళ్లు సయ్యద్‌ బాషా, సయ్యద్‌ అజంతుల్లా, సయ్యద్‌ ఇదాంతుల్లా రొంపిచెర్ల తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మా తాత సయ్యద్‌ గఫూర్‌సాబ్‌ పేరుతో సర్వే నంబరు 558–17లో 4 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఇప్పుటికి కూడా అన్‌లైన్‌లో ఆమర పేరుతోనే ఉందన్నారు. అయితే రొంపిచెర్లకు చెందిన కొందరు మాకు తెలియకుండానే పట్టా భూమిని డీకేటీ పట్టా తీసుకుని అక్రమించుకున్నారని, మామిడి చెట్లు నాటారని తెలిపారు. దీనిపై గత 10 సంవత్సరాలుగా మండల, జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. మా పట్టా భూమి ఎక్కడ ఉందో కొలతలు వేసి చూపించాలని మండల రెవెన్యూ అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. మాకు ఉన్న ఆస్తిని కూడా బెదిరించి కాజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. అధికారులు న్యాయం చేయకపోతే ఆత్యహత్యలే శరణమన్నారు.

నోటీసులు జారీ చేశాం: తహసీల్దార్‌

గతంలో రిజిస్టర్‌ అయిన పట్టా భూమికి డీకేటీ పట్టా మంజూరు చేసి ఉన్నారు. దీనిపై బాధితులు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలకు నోటీసులు జారీ చేశాం. త్వరలోనే భూమిని కొలతలు వేసి వాస్తవాలను తెలుసుకుంటాం. సయ్యద్‌ గఫూర్‌సాబ్‌ భార్య, ఇద్దరు కుమారులు మరొకరికి అగ్నిమెంట్‌ రాసి ఇచ్చినట్లు కూడా మాకు ఫిర్యాదు వచ్చింది. రిజిస్టర్‌ భూమిని అగ్రిమెంట్‌ చేసుకున్నా చెల్లదన్నారు. విచారణ చేసి పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్‌కు పంపుతామన్నారు.

న్యాయం చేయాలని తహసీల్దార్‌కు వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement