మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలో మనప్పురం రీతు జువెలరీస్ దుకాణంలో భారీ మోసం వెలుగు చూసింది. తరుగు, కూలీ లేకుండా తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మ బలికి అమాయక ప్రజలు, వినియోగారులు, ఖాతాదారుల చెంత రూ.కోట్లల్లో డబ్బులు వసూలు చేసిన మేనేజర్ పరారవడం స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక ఎన్‌టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రీతు జువెలరీస్‌లో కేరళకు చెందిన సూరజ్ మేనేజర్ గా పని చేసేవాడు. ఈ క్రమంలో మణప్పురం జువెలరీ సంస్థ వినియోగదారులకు ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టింది. తరుగు, కూలీ లేకుండానే బంగారం ఇస్తాం అంటూ ఊదరగొట్టి, చీటీల రూపంలో నెల నెల సాధారణ ప్రజలు, ఖాతాదారులు,వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు పథకంలో పట్టణంతో పాటు జిల్లాలోని అనేక మందిని చేర్పించినట్లు తెలిసింది. వీరి దగ్గర డబ్బు పొగుచేసిన మేనేజర్ సూరజ్ పైకం మెత్తాన్ని ఐడీల ద్వారా దొంగ రశీదులు తయారుచేసి తన సొంత అకౌంట్‌కు వేయించుకున్నట్లు సమాచారం. ఇలా సుమారు రూ.2.5 కోట్లకుపైగా వినియోగదారుల డబ్బులు దారి మళ్లించి ఇటీవల సూరజ్ సంస్థకు కూడా కూడా బురిడీకొట్టించి పరారయ్యాడు. కంతులు తీరిన బాధితులు, చీటీలు కట్టిన వారు క్యూ కడుతున్నా వారికి యాజామాన్యం నుంచి ఎలాంటి భరోసా దక్కలేదు. దీంతో బాధితులు విసిగిపోయి సోమవారం రాత్రి మణప్పురం రీతు జువెలరీ దుకాణం వద్దకు చేరుకుని ప్రస్తుతం పనిచేస్తున్న మేనేజర్ మోహన్ ను నిలదీశారు. తాము సూరజ్ చేతిలో మేసపోయామన్నారు. తాము సంస్థను చూసి పెట్టుబడి పెట్టామని తమకు సంస్థనే పూచిపడి ఎప్పట్లోగా ఇస్తారో తేల్సాల్చి ఉందని బాధితులు నిలదీశారు. సంస్థ మేనేజర్ నుంచి సమాధారం రాక పోవడంతో బాధితులు నిరసన తెలిపారు.ఈ విషయమై ప్రస్తుత మణప్పురం మేజర్ మోహన్ మాటాడుతూ.. తాను ఇరవై రోజుల క్రితమే వచ్చానని, తనకు ఏమి తెలియదని సమాధానం ఇచ్చాడు. ఒకటో పట్టణ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
ఖాతాదారుల సొమ్ముతో ఉడాయించిన జువెలరీ మేనేజర్


