భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత

Mar 31 2026 8:26 AM | Updated on Mar 31 2026 8:26 AM

కమలాపురం : పరిశ్రమల్లో పని చేసే ప్రతి ఒక్కరూ భద్రతను బాధ్యతగా తీసుకుని పని చేయాలని డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌(డీసీఐఎఫ్‌) చిన్నారావు తెలిపారు. సోమవారం మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌)లో 55వ జాతీయ భద్రతా దినోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించారు. ముందుగా ప్లాంట్‌ హెడ్‌ రామమూర్తి, సీటీఓ అతుల్‌ ప్రియదర్శి, చీఫ్‌ మేనేజర్‌ భార్గవ్‌రెడ్డి, సేఫ్టీ ప్రతినిధి అమూల్య, సేఫ్టీ ఇన్‌చార్జి మహేశ్వర్‌ రెడ్డిలతో కలసి జాతీయ భద్రతా జెండాను ఆవిష్కరించారు.అలాగే ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన పని ప్రదేశంలో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పీపీఈ(పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్మెంట్‌) స్టాల్‌ను రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీసీఐఎఫ్‌ చిన్నారావు మాట్లాడుతూ భద్రత నాతో ప్రారంభం అవుతుంది అనే భావనతో ప్రతి వ్యక్తి అన్ని స్థాయిల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతా థీమ్‌ను ఉదహరణలతో వివరించారు. ప్లాంట్‌ హెడ్‌ రామ మూర్తి మాట్లాడుతూ భద్రత ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగమై ఉండాలన్నారు. ప్లాంట్‌లో ప్రతి పనిని భద్రతతో చేయడం అత్యంత అవసరన్నారు. సీటీఓ అతుల్‌ ప్రియదర్శి మాట్లాడుతూ పని ప్రదేశంలో ఉన్న అసురక్షిత పరిస్థితులను తక్షణం గుర్తించి వాటిని సరిదిద్దాలన్నారు. అనంతరం భద్రతపై చిన్నారులు చేసిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భద్రతపై చైతన్యం పెంపొందించడంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులు, పాఠశాల, పాలిటెక్నిక్‌ విద్యార్ధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement