మనోహరం..మోహినీస్వరూపం | - | Sakshi
Sakshi News home page

మనోహరం..మోహినీస్వరూపం

Mar 29 2026 7:09 AM | Updated on Mar 29 2026 7:09 AM

నేడు సీతారాముల కల్యాణం

మోహినీ అవతారంలో శ్రీరామచంద్రమూర్తి

సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న ప్రతాప రాముడు

వాల్మీకిపురం: జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన వాల్మీకిక్షేత్రంలోని శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి పల్లకీలో మోహినీ అవతారంలో తేజోమూర్తిగా మురిపిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన నిర్వహించారు.అనంతరం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. సూర్యప్రభ వాహన సేవ అనంతరం 10 గంటల నుంచి స్నపన తిరుమంజనం జరిపారు. సాయంత్రం 6 గంటల నుంచి శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. రాత్రి 8గంటలకు పల్లకీలో మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటాలు, చెక్కభజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్‌, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు:

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం 8గంటల నుంచి తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం ఊంజల్‌సేవ, 8నుంచి 10గంటల వరకు శ్రీరామ కల్యాణోత్సవం, 11నుంచి 2.30గంటల వరకు గరుడసేవ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

వాల్మీకిపురం: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలల్లో భక్తులు తరలిరానున్నారు.ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా స్థానిక తోటవీధిలో టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు

రేపు రథోత్సవం

శ్రీ పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 7గంటలకు రథారోహణం, 9:10 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం రథాన్ని, రంగురంగుల పుష్పాలు, అరటి కొమ్మలతో అలంకరించారు.

సూర్య, చంద్రప్రభ వాహనాలపై

శ్రీరాముడి విహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement