రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు

Mar 29 2026 7:09 AM | Updated on Mar 29 2026 7:09 AM

మదనపల్లెటౌన్‌: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు ఎస్‌ఐ మధురామ చంద్రుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తంబళ్లపల్లె మండలం, కన్నె మడుగు కు సాకలపల్లికు చెందిన వరుణ్‌ (25) మదనపల్లెలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలో సొంత పని మీద బైకులో బోయకొండకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. బైక్‌ కురబలకోట మండలం, దాదాంవారిపల్లి దగ్గరకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో వరుణ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

ఆటో ఢీకొని భవన కార్మికుడికి..

మదనపల్లె టౌన్‌: ఆటో ఢీకొని భవన కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుని కథనం మేరు... మండలంలోని సీటీఎం గంగాపురానికి చెందిన భవన కార్మికుడు బాలాజి(27) రోజూ మాదిరిగానే భవన నిర్మాణం పనులు చేయడానికి మదనపల్లెకు వచ్చాడు. సాయంత్రం వరకు పనులు చేసి చీకటి పడగానే బైకులో ఇంటికి బయలు దేరాడు. సీటీఎం రోడ్డు, ఐదోమైలు రాయి వద్ద ఉండే పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ పట్టుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పైకి వచ్చాడు. అదే సమయంలో ఓ ఆటో వేగంగా వచ్చి బాలాజి బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రకి తరలించగా డాక్టర్లు వైద్యం అందించారు. డాక్టర్ల సలహా మేరకు అక్కడి నుంచి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. తాలూక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement