బి.కొత్తకోట సీఐపై ఎస్పీకి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

బి.కొత్తకోట సీఐపై ఎస్పీకి ఫిర్యాదు

Mar 27 2026 8:48 AM | Updated on Mar 27 2026 8:48 AM

మదనపల్లెటౌన్‌: తాము మేజర్లమని.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను బి.కొత్తకోట సిఐ గోపాల్‌ రెడ్డి విడదీసి, అమ్మాయిని తల్లిదండ్రుల వెంట పంపేశాడని గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లికి బాధిత యువకుడు మదనపల్లెలో ఫిర్యాదు చేశాడు. వివరాలు.. ములకలచెరువు మండలం, మద్దినాయునిపల్లె పంచాయతీ, బూడిదగడ్డపల్లెకు చెందిన ముక్కండ్ల ఉత్తన్న కొడుకు వినోద్‌ కుమార్‌ భవన కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బి.కొత్తకోట మండలం, సూరపువారిపల్లె పంచాయతీ, దయ్యాలవారిపల్లెకు చెందిన జయరామిరెడ్డి కుమార్తె హారిక ప్రేమించు కుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలసి పెళ్లికి నిరాక రించడంతో వెళ్లిపోయి ఒరిస్సాలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో సీఐ తమను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి ఇద్దరం మేజర్లు అయినా కొట్టి విడదీసి వేరుచేశారని ఆరోపించారు.ఈ మేరకు జిల్లా ఎస్పీ కి బాధితుడు వినోద్‌ కుమార్‌ ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement