ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం తగదు

Mar 27 2026 8:48 AM | Updated on Mar 27 2026 8:48 AM

రొంపిచెర్ల ఇన్‌చార్జి తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌తో మాట్లాడుతున్న జెడ్పీటీసీ రెడ్డిశ్వర్‌ రెడ్డి, రొంపిచెర్ల పోలీసు స్టేషన్‌లో ఉన్న జేసీబీ

రొంపిచెర్ల: ప్రజాసమస్యల పరిష్కారంలో రొంపిచెర్ల ఇన్‌చార్జి తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌కు నిర్లక్ష్యం తగదని జెడ్పీటీసీ రెడ్డిశ్వర్‌ రెడ్డి అన్నారు. అయన గురువారం తహసీల్దార్‌ను కలసి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ బండకిందపల్లె గ్రామపంచాయతీలోని పెద్ద చెరువులో షబీర్‌ జేసీబీతో మట్టి తోలుకుంటున్నారని జేసీబీని తహసీల్దార్‌ సీజ్‌ చేశారని తెలిపారు. అయితే 13 రోజులుగా బాధితుడు కార్యాలయం చూట్టు తిరుగుతున్న పట్టించుకోక పోవడం తగదన్నారు. మండలంలో జేసీబీలు, ట్రాక్టర్‌, టిప్పర్లు నిత్యం మట్టి తరలిస్తున్నా కన్నెత్తి చూడని తహసీల్దార్‌ సొంతానికి మట్టి తోలుకుంటున్న షబీర్‌ జేసీబీని సీజ్‌ చేయడం భావ్యం కాదన్నారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఏకపక్షంగా పని చేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ విచారణ చేసి బాధితుడికి న్యాయం చేయలని కోరారు. బాధితుడు షబీర్‌ మాట్లాడుతూ తన జేసీబీని అన్యాయంగా సీజ్‌ చేశారని తెలిపారు. మండలంలో చెరువులలో ఎక్కడ చూసినా జేసీబీలతో మట్టి తరలిస్తున్నారని వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రంజాన్‌ పండుగ సందర్భంగా మనోవేదనకు గురి చేశారని ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్యహత్యే శరణ్యం అని అన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు విజశేఖర్‌, హరికృష్ణారెడ్డి, శ్రీనాధ నాయుడు, అల్లాబక్షు, ప్రశాంత్‌ రెడ్డి, బావాజీ, ఓబులేసు, కరుణాకర్‌, రామ నారాయణ రెడ్డి, నరేష్‌, కిషోర్‌, ఉమాపతి నాయుడు, మహబుబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

ఏడీ మైన్స్‌కు అప్పగించాం:

తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌

బండకింఒదపల్లె గ్రామ పంచాయతీలోని చెరువులో మట్టి తరలిసున్నారని అందిన సమాచారం మేరకు తనిఖీ చేసి జేసీబీని సీజ్‌ చేశాం. దీనిపై చర్యలు తీసుకోవాలని ఏడీ మైన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశాం. చట్టానికి అందరు సమానమే . అనుమతి లేకుండా చెరువులలో మట్టి తరలించడం నేరం. మట్టి తరలింపుపై ఫిర్యాదు వస్తే సీజ్‌ చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement