మొరుసుపల్లిలో ఏఎస్పీ, డీఎస్పీల విచారణ | - | Sakshi
Sakshi News home page

మొరుసుపల్లిలో ఏఎస్పీ, డీఎస్పీల విచారణ

Mar 27 2026 8:48 AM | Updated on Mar 27 2026 8:48 AM

బైక్‌పై నుంచి పడి రైతుకు.. దాడిలో తండ్రీ కొడుకులకు..

పెద్దతిప్పసముద్రం: మండలంలోని కమ్మచెరువు పంచాయతి మొరుసుపల్లికి చెందిన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనను కిడ్నాప్‌ చేసి, ఓ గృహంలో నిర్బంధించి, కులం పేరుతో దూషించాడని ఇదే గ్రామనికి చెందిన ఓ మహిళ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం అడిషనల్‌ ఎస్పీ వెంకటాద్రి, మదనపల్లి డీఎస్పీ మహేంద్ర, ములకలచెరువు సీఐ వెంకటేశులు, పీటీఎం ఎస్‌ఐ పరమేశ్‌ నాయక్‌లు మొరుసుపల్లి గ్రామానికి వెళ్లి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. జరిగిన ఘటనపై ఆరా తీసి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని పోలీసులు వెల్లడించారు.

మహిళపై దాడి: తీవ్రగాయాలు

మదనపల్లెటౌన్‌: ఇంట్లో ఇంటరిగా ఉన్న మహిళపై దాడి జరిగిన సంఘటన బుధవారం రాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు స్థానిక రామారావు కాలనీకి చెందిన రెడ్డెప్ప భార్య పి.ఉషారాణి(45) కాలనీకి చెందిన ఓ ఉంట్లో అద్దెకు ఒంటరిగా ఉంటోంది. అదే ఇంట్లో పై పోర్షన్‌లో ఉంటున్న మజ్జిగ కృష్ణారెడ్డికి చెందిన కుక్కలకు కృష్ణారెడ్డి కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చి ఉషారాణి ఇంటి గేటు ముందు వేయడంతో ఆమె కృష్ణారెడ్డితో గొడవ పడింది. దీంతో మాటా మాట పెరి గి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఉషారాణిపై ఇనుప రా డ్డుతో దాడిచేశాడు. ఘటనలో తీవ్రంగా గాయప డిన బాధితురాలిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు.

మదనపల్లెటౌన్‌: ద్విచక్రవాహనం పైనుంచి పడి రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. వివరాలు.. మండలంలోని బయప్పగారిపల్లె పంచాయతీ, గుండావాండ్లవారిపల్లెకు చెందిన మిత్రుడు శివారెడ్డితో కలసి సొంత పనిపై బైక్‌లో స్థానిక గుంతవారిపల్లెకు బయలుదేరారు. గుంతవారిపల్లెకు చేరే సమయంలో బైక్‌ పైన కూర్చొని ఉన్న రైతు చిన్న వెంకటరమణ ఆదమరచి నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ప్రమాదవశాత్తు బైక్‌ పైనుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడన అతన్ని స్థానికుల సాయంతో కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించడంతో కోలుకుంటున్నాడు.

మదనపల్లెటౌన్‌: దాడిలో తండ్రీ కొడుకు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. బాధితులు పెద్దమండ్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని కనకంటివారిపల్లెకు చెందిన రైతులు పాపిరెడ్డి, మల్‌ రెడ్డిలకు అదే ఊరికి చెందిన రైతు చంద్రశేఖర్‌రెడ్డితో గత కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు వస్తున్నారని టమటా కట్టెలను తమ పొలంలో లేకుండా దౌర్జన్యంగా తొలగించడాన్ని ప్రశ్నించడంతో, తమను కర్రలతో దాడి చేసి చంద్రశేఖర్‌ రెడ్డి కొట్టినట్లు బాధితులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement