ఓపిక, పట్టుదలతో విజయం దాసోహం | - | Sakshi
Sakshi News home page

ఓపిక, పట్టుదలతో విజయం దాసోహం

Mar 27 2026 8:48 AM | Updated on Mar 27 2026 8:48 AM

మిట్స్‌ అశ్వ్‌ ఫెస్ట్‌లో సందడి చేసిన సినీ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ మాళవిక నాయర్‌

సినీ హీరో శర్వానంద్‌ను సత్కరిస్తున్న మిట్స్‌ చాన్స్‌లర్‌ విజయభాస్కర్‌ చౌదరి

కురబలకోట: ఓపిక, పట్టుదలతో ముందుకు సాగితే విజయం దాసోహం అవుతుందని సీనీ హీరో శర్వానంద్‌ సూచించారు. గురువారం రాత్రి మిట్స్‌ యూనివర్సిటీలో జరిగిన అశ్వ్‌–2కె26 జాతీయ ఫెస్టివల్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ నాదేళ్ల విజయభాస్కర్‌ చౌదరి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిధిగా హీరో శర్వానంద్‌తో పాటు హీరోయిన్‌ మాళవిక నాయర్‌ హాజరై సందడి చేశారు. హీరో శర్వానంద్‌ఽ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు సహజమని అయితే ముందుకు సాగడానికి అధ్యయనం, అభ్యాసం, శిక్షణ, పరిశోధన, స్కిల్స్‌ తప్పనిసరి అని అన్నారు.. దైనందిన జీవితంలో ఓపిక పట్టుదల కూడా అవసరమన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా క్రమశిక్షణ ఉంటే సాధ్యం కానిది లేదన్నారు. కష్టపడే తత్వం ఉన్నవారి వెంట విజయం నడుస్తుందన్నారు. జబర్ద్‌స్త్‌ టీమ్‌ నవ్వులు పువ్వులు పూయించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ కార్యక్రమాలు మంత్ర ముగ్దులను చేశాయి. మదనపల్లెఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, ప్రో చాన్స్‌లర్‌ నాదేళ్ల ద్వారకనాఽథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మిట్స్‌ అశ్వ్‌ జాతీయ ఫెస్ట్‌లో

సినీ హీరో శర్వానంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement