సేద్యంలో 15 శాతం వృద్ధి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

సేద్యంలో 15 శాతం వృద్ధి సాధించాలి

Mar 25 2026 7:12 AM | Updated on Mar 25 2026 7:12 AM

నిరంతరం పటిష్ట నిఘా ఉండాలి

మదనపల్లె: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వార్షికంగా కనీసం 15 శాతం వృద్ధి సాధించేందుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన మదనపల్లె రూరల్‌ మండలంలోని అంకిశెట్టిపల్లెలో జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి చర్చిస్తూ సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు కల్పిస్తున్న ప్రయోజనాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలోనూ ఈ కార్యక్రమం నిర్వహించి, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ విధానాలు, పంటల ఎంపిక, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు భూమి రికార్డులు, ఈ–క్రాప్‌ నమోదు లోపాలు, సర్వే నంబర్ల మార్పులు, బ్యాంకు రుణాల మంజూరు, ఉమ్మడి ఖాతాల కారణంగా పాస్‌ పుస్తకాల జారీ ఆలస్యంపై కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్‌ రైతులు తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ, అధికారులు పాల్గొన్నారు.

రాయచోటి: జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌ వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉంచాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాయచోటి పట్టణం, మార్కెట్‌ యార్డులో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను మంగళవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్‌లో అంతర్భాగాలను రాజకీయ పార్టీల సమక్షంలో భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు, బీయూలు, సీయూలు, వీవీ ప్యాట్‌లను అక్కడి భద్రత చర్యలను కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలను కలెక్టర్‌ సమాధా నం ఇచ్చారు. రాయచోటి ఆర్డీఓ ఏ శ్రీనివాస్‌, తహశీల్దార్‌ నరింహ కుమార్‌, కలెక్టర్‌ ఎలక్షన్‌ సెక్షన్‌ సూపరిటెండెంట్‌ హరి పాల్గొన్నారు.

ఈవీఎం గోడౌన్‌ తనిఖీలో

కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement