రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్ర గాయాలు

Mar 25 2026 7:12 AM | Updated on Mar 25 2026 7:12 AM

మదనపల్లె టౌన్‌ : ములకలచెరువు మండలంలో సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య, భర్తలతోపాటు వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై ములకలచెరువు ఎస్‌ఐ ప్రతాప్‌ తెలిపిన వివరాలు.. పెద్దతిప్పసముద్రం మండలం కొత్తపల్లికి చెందిన దంపతులు రమణప్ప, కృష్ణవేణి తన కుమారున్ని వెంట తీసుకుని బైకులో సొంత పని మీద ములకలచెరువుకు బయలుదేరారు. స్కూటర్‌ మార్గంమధ్యలోని ములకలచెరువు మండలంలోని మిడసానిపల్లెకు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి అదుపు తప్పి పడి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం రమణప్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు. తల్లి కుమారుడు మదనపల్లె జిల్లా ఆస్పత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు.

తీవ్రంగా గాయపడిన రమణప్ప, చికిత్స పొందుతున్న తల్లీకుమారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement