పుంగనూరు: రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ముస్లిం కుటుంబాలన్నీ ఐకమత్యంతో, సుఖసంతోషాలతో ఈ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. క్రమశిక్షణ, ఐకమత్యం, దైవచింతనకు రంజాన్ పండుగ ప్రతీక అని కొనియాడారు. ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వారు కోరారు.
రాష్ట్ర మాజీ మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
రాజంపేట ఎంపీ
పీవీ మిధున్‌రెడ్డి


