రంజాన్ పవిత్ర మాసంలో పాటించిన క్రమశిక్షణ, అలవర్చుకున్న సద్గుణాలను కేవలం ఈ నెలకే పరిమితం చేయకుండా జీవితాంతం కొనసాగించాలి. ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించాలి. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా నేర్చుకున్న నియమ నిబంధనలను నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలి. – మౌలానా జలాలుద్దీన్ సాహెబ్,
ప్రభుత్వ సర్‌ఖాజీ
ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలి
రంజాన్ మాసంలో అలవర్చుకున్న మంచి లక్షణాలను ఎల్లప్పుడూ కొనసాగించాలి. సద్గుణాలను నిరంతరం పాటించినప్పుడే అల్లాహ్ కరుణాకటాక్షాలు లభిస్తాయి. పండుగ శుభవేళ ప్రతి ముస్లిం సోదరుడు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి.
–ఇక్బాల్ అహ్మద్, మదనపల్లె ప్రభుత్వ ఖాజీ


