మహిళాభ్యున్నతే దేశాభ్యున్నతి | - | Sakshi
Sakshi News home page

మహిళాభ్యున్నతే దేశాభ్యున్నతి

Mar 9 2026 7:23 AM | Updated on Mar 9 2026 7:23 AM

మహిళాభ్యున్నతే దేశాభ్యున్నతి

మదనపల్లె: మహిళాభ్యున్నతే దేశాభ్యున్నతి అని, సంస్కృతి, సంప్రదాయం వారసత్వానికి మహిళలు కీలకమని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆదివారం మదనపల్లెలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ లో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలలో మహిళలకు విశిష్ట స్థానం ఉందన్నారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక థీమ్‌తో ఈ వేడుకలను నిర్వహిస్తుండగా ఈ ఏడాది గివ్‌ టు గైన్‌ థీమ్‌తో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలో 1,11,742 మంది మహిళలకు పింఛన్లు అందిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల సో స్వయం సహాయక సంఘాలకు 202526లో 16,133 సంఘాలకు రూ.1444.71 కోట్లు రుణ లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటిదాకా 10,577 సంఘాలకు రూ.1403.71 కోట్లు అందించామన్నారు. సీ్త్రనిధి ద్వారా 35,622 మందికి మహిళలకు రూ.226.53 కోట్ల లక్ష్యంలో 35,622 మందికి రూ.269.19 కోట్లు మంజూరు చేశామన్నారు. ఉన్నతి పథకం ద్వారా 202526లో 2,142 మందికి రూ.11.97 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 1879 మందికి రూ.12.56 కోట్లు మంజూరు చేశామన్నారు.సురక్షితమైన సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి సంప్రదాయాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి మాట్లాడుతూ జిల్లాలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీస్‌ శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. మహిళల భద్రత కోసం పోలీస్‌ శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా మాట్లాడుతూ మహిళలు సమాజానికి మార్గదర్శకులని తెలిపారు. సభలో వెలుగు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి హైమావతి, హార్టికల్చర్‌ అధికారి సుభాషిణి, డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, మెప్మా పీడీ లక్ష్మి, డాక్టర్‌ కోటీశ్వరమ్మ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల, ఫోర్డ్‌ లలితమ్మ, వెలుగు భాగ్యలక్ష్మి, చైతన్య ప్రతినిధి కవిత, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌,

ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి

Advertisement
 
Advertisement
Advertisement