వైవీయూ ఆచార్యుడికి అరుదైన గౌరవం
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ కణుసు శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ విజయవాడలోని రాజ్‌భవన్‌లో నిర్వహించే అధికారిక ఆతిథ్య కార్యక్రమంలో (ఎట్ హోం) పాల్గొనే అవకాశం దక్కింది. శ్రీనివాసరావు ప్లాంటేషన్, రక్తదానం, ఓటు అవగాహన, స్వచ్ఛ భారత్, వైద్య శిబిరాల నిర్వహణ, సామాజిక స్పృహను పెంచే కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తదితరులు అభినందనలు తెలిపారు.


