●హంద్రీ–నీవా నాశనం | - | Sakshi
Sakshi News home page

●హంద్రీ–నీవా నాశనం

Jan 8 2026 6:58 AM | Updated on Jan 8 2026 6:58 AM

●హంద్

●హంద్రీ–నీవా నాశనం

●హంద్రీ–నీవా నాశనం

అభివృద్ధిపై కక్ష వద్దు

తాను చేపట్టని సాగునీటి ప్రాజెక్టులంటే చంద్రబాబుకు చిన్నచూపు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన రూ.వేల కోట్ల ప్రాజెక్టులను

నిలిపివేసిన బాబు సర్కార్‌

మదనపల్లె : చంద్రబాబు అధికారంలో ఉండగా .. ఇతరుల హయాంలో మొదలైన ప్రాజెక్టులకు గ్రహణం పట్టినట్లే. అవును.. ఆయన చేపట్టని ప్రాజెక్టులంటే అస్సలు గిట్టదంతే.. ప్రాజెక్టుల పనులు మొదలైనా, పురోగతిలో ఉన్నా, చివరదశలో ఉన్నా సరే ఒక్క అడుగు ముందుకేస్తే ఒట్టే. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వ్యవసాయంపై ఆధారపడిన మన గ్రామీణ ప్రాంతాల రైతాంగానికి నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉండాలి. దీనికోసం అందుబాటులోని వనరులను సద్వినియో గం చేసుకోవాలి లేదంటే ప్రాజెక్టుల ద్వారా నీటి ఆధారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. దీన్ని అక్షరాలా పాటించిన పాలకులు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. వీరిపాలనలో ఎప్పుడూ జరగనంతగా ప్రాజెక్టుల అభివృద్ధి జరిగింది. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి రైతాంగ ప్రయోజనాలను కాపాడాల్సిన చంద్రబాబు సర్కా ర్‌ వీటికి మరణశాసనం రాశారు. వేలకోట్లతో జరిగిన ప్రాజెక్టుల పనులు ఆగిపోయి కనిపిస్తున్నాయి. తనసొంతజిల్లాకు ఉపయోగమైనా సరే... ఎన్టీఆర్‌ చేపట్టిన హంద్రీ–నీవా ప్రాజెక్టు కూడా చంద్రబాబు పాలనలో వెన్నుపోటుకు గురైంది. అదే ప్రాజెక్టును సీఎం వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేపట్టి అత్యధిక శాతం పనులు పూర్తిచేస్తే..దీన్ని అపలేని పరిస్థితుల్లో కొంతమేర పని చేయించి ఇదిగో ఇది నా ఘనత, హంద్రీ–నీవాను నేనే పూర్తి చేశానంటూ చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.

అనుసంధానం వద్దంట

చంద్రబాబు సొంతజిల్లా ఉమ్మడిచిత్తూరుకు ప్రయోజనం కలిగించే హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల అనుసంధానంతో కరువు రైతుల తలరాతను మార్చేదిశగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రూ.4,373.23 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రూ.1,220 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఈ అనుసంధానం ద్వారా గండికోట రిజర్వాయర్‌ నుంచి 20 టీఎంసీల కృష్ణానీటిని తరలిస్తారు. 13 టీఎంసీలు ఉమ్మడిచిత్తూరుజిల్లాకు పంపిణీ అవుతాయి. తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల ప్రయోజనం. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు వద్దంటూ పనులు నిలిపివేశారు. దీనివల్ల నిధుల వినియోగం నిష్పలంకాగా రైతాంగానికి ప్రయోజనం అన్న విషయాన్ని పట్టించుకోకుండా తాను చేపట్టింది కాదన్న ధోరణితో ఆపేయించారు. ఈ పథకంవల్ల అడవిపల్లె, శ్రీనివాసపురం రిజర్వాయర్లు, ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్లను నింపుతారు. ఈ పథకంతో ఈ ప్రాంతంలో కొత్తగా 2,48,150 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. అయితే కూటమి పాలనలో చంద్రబాబు సర్కార్‌కు ఇది ఇష్టంలేదు ప్రాజెక్టు ఆగిపోయింది.

వైడనింగ్‌ అసలే వద్దు

హంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగంపై పుంగనూరు ఉపకాలువను వెడల్పు అధిక సామర్థ్యంలో కృష్ణాజలాలను తరలించి రైతాంగానికి సాగునీరు ఇద్దామని వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రూ.1,929 కోట్లతో పనులు చేపట్టారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి ఈ ప్రాజెక్టు మంజూరు కోసం చాల శ్రమపడ్డారు. చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి రాగానే పనులను అడ్డుకుంది. వెడల్పు పనులు వద్దంటూ, ఈ నిధుల నుంచే రూ.480 కోట్లతో లైనింగ్‌ పనులు చేపట్టింది. లైనింగ్‌ వద్దని రైతులు వ్యతిరేకించినా పట్టించుకోలేదు. దీనివల్ల రైతులు 13 టీఎంసీల అదనపు కృష్ణా జలాలను కోల్పోవాల్సి వచ్చింది.

రిజర్వాయర్ల అడ్డగింత

జిల్లాలోని తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.2,100 కోట్లతో చేపట్టిన ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాంతాలకు గత పాలకులు పట్టించుకోకపోవడంతో మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవి.మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కృషితో రిజర్వాయర్లను మంజూరు చేయించారు. ఈ పనులు ప్రారంభమై కీలకదశలో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు టీడీపీ నేతలతో కేసులు వేయించి పనులు అడ్డుకున్నారు. తర్వాత ప్రాజెక్టుల సందర్శన చేపట్టి చంద్రబాబు ప్రజలు, రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేలా విమర్శలు చేశారు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రైతులకు ద్రోహం చేయడమే. రైతులు, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పును తెచ్చి వ్యవసాయ అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలంటారు. ఒక అభివృద్ధి పని మొదలయ్యాక ఏ ప్రభుత్వమైనా కొనసాగించి వాటి ఫలాలను ప్రజలకు అందించడం బాధ్యత. దీన్ని విస్మరించడం దారుణం. కోట్లు ఖర్చుచేసిన ప్రాజెక్టుల పనులు నిరుపయోగం చేయడం భావ్యంకాదు. రైతు ప్రయోజనాలను కాపాడేలా ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. – పీవీ.మిథున్‌రెడ్డి, రాజంపేట ఎంపీ

●హంద్రీ–నీవా నాశనం1
1/3

●హంద్రీ–నీవా నాశనం

●హంద్రీ–నీవా నాశనం2
2/3

●హంద్రీ–నీవా నాశనం

●హంద్రీ–నీవా నాశనం3
3/3

●హంద్రీ–నీవా నాశనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement